చంద్రబాబుకు దమ్మంటే నాపై పోటీచేయాలి: సూర్య నారాయణ సవాల్‌ | Suryanarayana Reddy Political Challenge To TDP Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు దమ్మంటే నాపై పోటీచేయాలి: సూర్య నారాయణ సవాల్‌

Feb 18 2023 3:41 PM | Updated on Feb 18 2023 3:57 PM

Suryanarayana Reddy Political Challenge To TDP Chandrababu - Sakshi

సాక్షి, అనపర్తి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే సూర్య నారాయణ రెడ్డి సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2వేల మంది కూడా పట్టని చోట సభ పెట్టాలనుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, సూర్యనారాయణ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దౌర్జాన్యానికి దిగడం దారుణం. టీడీపీ నేతల చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ హయంలో ఏరోజూ అనపర్తిని పట్టించుకోలేదు. అనపర్తిలో ఎప్పుడూ కులాల ప్రస్తావన లేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి కులాల ప్రస్తావన తెస్తున్నారు. చంద్రబాబు పక్కన ఉన్న అవినీతిపరుల గురించి అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారు. చంద్రబాబుకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలవాలి అని సవాల్‌ విసిరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement