కేంద్ర సహాయక శాఖ మంత్రిగా సురేష్‌ గోపి | Sakshi
Sakshi News home page

కేంద్ర సహాయక శాఖ మంత్రిగా సురేష్‌ గోపి

Published Mon, Jun 10 2024 9:14 PM

Suresh Gopi Mos For Petroleum, Natural Gas, And Tourism In Nda Cabinet

కేరళ బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు సురేష్ గోపి సాంస్కృతిక సహాయక శాఖ పదవి దక్కించుకున్నారు. అయితే ఆదివారం (జూన్‌ 9న) మోదీ 3.0లో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా సురేష్‌ గోపి తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  

అయితే రాజీనామా వార్తల్ని సురేష్‌ గోపి ఖండించారు. ‘నేను కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నామంటూ పలు మీడియా సంస్థలు కథనాల్ని ప్రచారం చేశాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అవి పూర్తిగా తప్పుడు కథనాలు’ అని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మేం కేరళ అభివృద్ధి శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాము అని గోపి అన్నారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement