కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. కొన్ని కీలక హామీలు ఇవే.. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. కొన్ని కీలక హామీలు ఇవే..

Published Thu, Nov 16 2023 12:53 PM

Some Key Promises In TS Congress Manifesto - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. కాగా, మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అమ్మహస్తం పేరుతో తొమ్మిది రకాల నిత్యవసర వస్తువుల పంపిణీని మేనిఫెస్టోలో పొందుపరచినట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో​ ప్రజలను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో సిద్దమైనట్టు తెలుస్తోంది. మేనిఫెస్టోలో కీలక హామీలను ఇచ్చినట్టు  సమాచారం. తెలంగాణ మేనిఫెస్టోను రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. 

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు..
►ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్‌గ్రేడ్‌ యాప్‌. 
►గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం. 
►రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనంతో పాటుగా కమీషన్‌. 
►అభయ హస్తం పథకం తిరిగి పునద్దరణ.
►ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డులు. 
►అమ్మహస్తం పేరుతో 9 నిత్యవసర వస్తువుల పంపిణీ. 
►ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్‌. 
►పెళ్లి కూతురు కానుకగా లక్షతో పాటు తులం బంగారం
►రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం

Advertisement
 
Advertisement