పవన్‌ కల్యాణ్‌వి పిల్ల చేష్టలు | Sailajanath Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌వి పిల్ల చేష్టలు

Nov 21 2020 4:41 AM | Updated on Nov 21 2020 4:41 AM

Sailajanath Comments On Pawan Kalyan - Sakshi

ఉద్దండరాయునిపాలెం(తాడికొండ): పవన్‌కల్యాణ్‌వి పిల్ల చేష్టలని, అమరావతి ఉద్యమానికి మద్దతు అని చెబుతూ..శంకుస్థాపనకు వచ్చిన మోడీని ఎందుకు నిలదీయడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం అమరావతి రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో ఆయన పర్యటించారు.

శైలజానాథ్‌ మాట్లాడుతూ..అమరావతి కోసం ప్రణాళికాబద్ధంగా జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తున్న పార్టీ ఒక్క కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు. త్వరలో  జాతీయ నాయకులతో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.  మాజీ మంత్రి జేడీ శీలం, పార్టీ నేతలు తులసీరెడ్డి,  మస్తాన్‌ వలీ,  చిలకా విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement