150 కోట్ల మంది చూపు కామారెడ్డి వైపే : రేవంత్‌రెడ్డి

Revanth reddy comments at kamareddy public meeting - Sakshi

సాక్షి, కామారెడ్డి : పది సంవత్సరాలు కష్టాలు పడ్డామని, కేసీఆర్‌కు తిరిగి చెల్లించే సమయం వచ్చిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్‌ సభలో రేవంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి ఎన్నికల తీర్పు భారత దేశ చరిత్రలో గొప్ప తీర్పుగా నిలవాలన్నారు. 150 కోట్ల మంది కామారెడ్డి వైపు చూస్తున్నారన్నారు. 

‘డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెట్టి గెలవాలనుకుంటున్నాడు కేసీఆర్‌. తెలంగాణలో ఉచిత కరెంట్, మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మనతో లేరు కానీ ఆయన హయాంలో 12 వేల కోట్ల రూపాయల కరెంటు బకాయిల రద్దు చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ , ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, మేడిగడ్డ, పాలమూరు ప్రాజెక్టు గురించి కేసీఆర్‌ మాట్లాడతలేడు.

ప్రపంచం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోంది. ఎమ్మెల్యేగా ఎక్కడైనా గెలుస్త కానీ కేసీఆర్‌కు బుద్ధి చెప్పడానికి కామారెడ్డికి వచ్చిన. కామారెడ్డి రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది. కర్ణాటకలో గెలిచినట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనూ జెండా ఎగురవేస్తుంది

24 గంటల ఉచిత విద్యుత్‌పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధం. తెలంగాణలో 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్‌లో, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటా. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్‌ ఉపసంహరణకు టైం ఉంది. లాగ్‌బుక్‌లు తీసుకుని కామారెడ్డికి రా’ అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. 

దొరల రాజ్యానికి..ప్రజల రాజ్యానికి పోటీ.. షబ్బీర్‌ అలీ 

‘కామారెడ్డిలోని పచ్చని భూములపై కేసీఆర్ కన్ను పడింది. కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పోటీ చేయలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం. కామారెడ్డిలో దొరల రాజ్యానికి ప్రజల రాజ్యానికి మధ్య పోటీ జరుగుతోంది. ప్రతి కార్యకర్త నేనే రాహుల్ గాంధీ, నేనే సోనియా గాంధీ, నేనే రేవంత్ రెడ్డి, నేనే షబ్బిర్ అలీ అని భావించుకొని పనిచేయాలి’ అని షబ్బీర్‌ అలీ కోరారు. 

ఇదీచదవండి..శుభకార్యాలు.. ప్రచారాలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top