రాజ్యాంగం చేతబూని ఎంపీగా ప్రమాణం | Rahul Gandhi Takes Oath As Lok Sabha MP With Constitution Copy In Hand, More Details Inside | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం చేతబూని ఎంపీగా ప్రమాణం

Jun 26 2024 3:00 AM | Updated on Jun 26 2024 11:59 AM

Rahul Gandhi takes oath as Lok Sabha MP with Constitution copy in hand

‘జైహింద్, జై సంవిధాన్‌’ అని నినదించిన రాహుల్‌ గాంధీ  

న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు మంగళవారం పలు పార్టీల సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ సభ్యుడు రాహుల్‌ గాం«దీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్‌ యాదవ్, డింపుల్‌ యాదవ్, బీజేపీ సభ్యుడు ఓం బిర్లా, బీజేపీ సభ్యురాలు హేమామాలిని, డీఎంకే నేత కనిమొళి, కేంద్ర మంత్రులు నారాయణ్‌ రాణే, ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే, శివసేన(ఉద్ధవ్‌) సభ్యుడు అరవింద్‌ సావంత్‌ తదితరులు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.

రాహుల్‌ గాం«దీ, అఖిలేశ్‌ యాదవ్‌ సహా పలువు ప్రతిపక్ష సభ్యులు రాజ్యాంగ ప్రతిని చేతబూని ప్రమాణం చేయడం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం రాహుల్‌ గాంధీ ‘జైహింద్, జై సంవిధాన్‌’ అంటూ నినదించారు. స్వతంత్ర సభ్యుడు రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పు యాదవ్‌ ‘నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాలి’ అని రాసి ఉన్న టి–షర్టును ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్‌ సమాజ్‌ పార్టీ(కాన్షీరామ్‌) ఎంపీ చంద్రశేఖర్‌ ప్రమాణం చేసిన తర్వాత ‘జైభీమ్, జైభారత్, జై సంవిధాన్, జైమండల్, జైజోహార్, జైజవాన్, జైకిసాన్‌’ అని నినాదాలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement