ప్రజలెన్నుకున్న ప్రభుత్వ ఉసురు తీసే యత్నం: చన్నీ 

Punjab CM Charanjit Singh Channi Comments On PM Modi Over Punjab Tour - Sakshi

టాండా (పంజాబ్‌): ప్రాణ హానిని ఎదుర్కొన్నానని ప్రధాని మోదీ అనడాన్ని పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ గిమ్మిక్కుగా అభివర్ణించారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ప్రధాని గౌరవనీయ దేశ నాయకుడని, ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి అల్ప నాటకానికి దిగడం ఆయన హోదాకు తగదని చన్నీ పేర్కొన్నారు.

‘రైతులు ఏడాది పొడవునా ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ప్రతికూలతల నడుమ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తే పట్టలేదు కాని 15 నిమిషాలు ప్రధాని రోడ్డుపై వేచి ఉండాల్సి వస్తే ఇంత రాద్దాంతమా? ఇవెక్కడి ద్వంద్వ ప్రమాణాలు’ అని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ధ్వజమెత్తారు. మోదీ పాల్గొనాల్సిన ఫిరోజ్‌పూర్‌ ర్యాలీకి కేవలం 500 మంది మాత్రమే వచ్చారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top