మోదీ, అమిత్ షాలపై ప్రియాంక గాంధీ ఫైర్‌ | Priyanka Gandhi Fires On PM Narendra Modi and Amit Shah | Sakshi
Sakshi News home page

మోదీ, అమిత్ షాలపై ప్రియాంక గాంధీ ఫైర్‌

Oct 10 2026 6:54 PM | Updated on Oct 10 2026 7:12 PM

Priyanka Gandhi Fires On PM Narendra Modi and Amit Shah

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నియంతృత్వ పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలను ఆమె ఖండించారు. 254 మంది ఎంపీలను అక్రమంగా నిర్బంధించి, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించారని ఎక్స్‌ వేదికగా ఆమె విమర్శించారు.

"దేశ రాజధానిని దిగ్బంధించి, రైళ్లు, మెట్రో సేవలను అడ్డుకుని, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసి, అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును వినియోగించుకుంటున్న యువతపై దాడులు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘం సహకారంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి" అని ప్రియాంక డిమాండ్‌ చేశారు.

మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన నిరసనల సందర్భంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సహా పలువురిని పోలీసులు నిర్బంధించారు. జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన సుమారు వెయ్యి మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిరసనకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాహుల్, విజయ్ భేటీ.. గంటపాటు చర్చలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement