Peddireddy Ramachandra Reddy Serious Comments on Chandrababu - Sakshi
Sakshi News home page

‘కుప్పంలో బాబు జెండా పీకేస్తారు’

Jan 14 2023 1:37 PM | Updated on Jan 14 2023 2:55 PM

Peddireddy Ramachandra Reddy Serious Comments On Chandrababu - Sakshi

సాక్షి, పుంగనూరు: టీడీపీ అధినేత చంద్రబాబు పండగ పూట కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఓటమి భయంతోనేన చంద్రబాబు ఇలా విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడీఆ వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం అని అన్నారు. 

కాగా, మంత్రి పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చిత్తూరు జిల్లాలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతోందని చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఈసారి కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తారు. 2019 నుంచే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు హంద్రీనీవా పూర్తి చేయలేకపోయారు. సీఎం వైఎస్ జగన్‌ వచ్చాక హంద్రీనీవాను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబుకు నచ్చదు. 

చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీకి విజయం ఖాయం. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా టీడీపీకి భవిష్యత్‌ ఉండదు. ఓటమి భయంతోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. నాపై చంద్రబాబు చేసినవి నిరాధారమైన ఆరోపణలు. చంద్రబాబు క్యారెక్టర్‌ లేని వ్యక్తి. కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement