కృష్ణంరాజు వ్యాఖ్యలను తమకు ఆపాదించడంపై వైఎస్సార్‌సీపీ ఖండన | The Party Has Nothing To Do With Krishnam Raju Comments: Ysrcp | Sakshi
Sakshi News home page

కృష్ణంరాజు వ్యాఖ్యలను తమకు ఆపాదించడంపై వైఎస్సార్‌సీపీ ఖండన

Jun 7 2025 9:44 PM | Updated on Jun 8 2025 10:04 AM

The Party Has Nothing To Do With Krishnam Raju Comments: Ysrcp

సాక్షి, తాడేపల్లి: జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించటంపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ, దానికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ‘‘జర్నలిస్టు కృష్ణంరాజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది.

‘‘తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్‌ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశాం. ఏ వేదికమీద అయినా మహిళల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి. మా పార్టీ అభిప్రాయంకూడా ఇదే. కానీ, మా పార్టీకి సంబంధంలేని వ్యక్తి, టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే, అవి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా తెలుగుదేశంపార్టీ, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

..దీన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్‌ మీడియా, వారి నాయకులు ఇష్టానుసారంగా, అనైతికంగా పోస్టులు పెడుతూ, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. జర్నలిస్టు కృష్ణం రాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని సమర్థించడంలేదని సాక్షిటీవీ ప్రజలకు ప్రకటనచేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నాం. అదే సమయంలో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని సమర్థించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నాం’’ అని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement