ఐదు రాష్ట్రాల్లో జోరందుకుంటున్న ఎన్నికల పోరు | Party competition in electoral states | Sakshi
Sakshi News home page

జోరందుకుంటున్న పోరు

Oct 21 2023 2:40 AM | Updated on Oct 21 2023 4:18 AM

Party competition in electoral states - Sakshi

అస్పష్టత తొలగుతోంది. బరిలో నిలిచేదెవరో తేలుతోంది. దాంతో సెమీఫైనల్స్‌ రసవత్తరంగా మారుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశలోకి ప్రవేశిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంల్లో పార్టీలన్నీ ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ దూసుకెళ్తున్నాయి. టికెట్ల పంపిణీ తలనొప్పులు, అసమ్మతులు, అసంతృప్తి రాగాల వంటి సమస్యలు ప్రతి పార్టీనీ పట్టి పీడిస్తున్నాయి... – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు టాప్‌ గేర్‌లోకి ప్రవేశించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో పోలింగ్‌ వారాల్లోకి వచ్చేసింది. దాంతో పార్టీలు స్పీడు పెంచాయి. అటు ప్రచారంలో దూసుకుపోతూనే, ఇటు ఇంటి పోరుకు తెర దించి నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు నానా పాట్లూ పడుతున్నాయి.

రాజస్తాన్‌లో రసవత్తరం
కాంగ్రెస్, బీజేపీల్లో ఒక్కోసారి ఒక్కొక్కరి కి అధికారం అప్ప జెప్పడం రాజస్తానీల ఆనవాయితీ. ఆ లెక్కన ఈసారి అధికార కాంగ్రెస్‌ ఆశలు వదులు కోవా ల్సిందే. కమలనాథులు ఖుషీగా ఉండాల్సిందే. కానీ అంతర్గత పోరు ఈసారి బీజేపీ పుట్టి ముంచేలా కన్పిస్తోంది. తొలి జాబితాలో ఆ పార్టీ కేవలం 41 పేర్లను మాత్రమే ప్రకటించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ముఖ్యంగా మాజీ సీఎం వసుంధరా రాజె సింధియా సన్నిహిత వర్గాల నేతలు పరస్పర విభేదాలతో పరిస్థితిని సంక్లిష్టంగా మారుస్తున్నారు.

వారిలో అనితా సింగ్‌ గుజర్, భవానీ సింగ్‌ రజావత్‌ వంటి టికెట్లు దక్కని పలువురు స్వతంత్రులుగానే బరిలో దిగుతామని ప్రకటించి నాయకత్వానికి గుబులు రేపుతున్నారు. ఈ జాబితా నానాటికీ పెరుగుతూనే ఉంది. ఎంపీలకు టికెట్లిచ్చిన స్థానాల్లో కూడా బలమైన ఆశావహులు సహాయ నిరాకరణకు దిగుతుండటం బీజేపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు.

కాంగ్రెస్‌ ముందుజాగ్రత్త
ఈ పరిస్థితిని ముందే ఊహించిన కాంగ్రెస్‌ తెలివిడితో వ్యవహరిస్తోంది. అంతర్గత తగాదాలు ఎలా ఉన్నా గెలుపు గుర్రాలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇస్తామని పదేపదే ప్రకటిస్తోంది. తద్వారా సీఎం అశోక్‌ గహ్లోత్, అసమ్మతి నేత సచిన్‌ పైలట్‌ వర్గాలు రెండింటినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. లేదంటే ప్రభుత్వ వ్యతిరేకతకు ఇంటి పోరు తోడై పరిస్థితి కష్టంగా మారుతుందన్నది ఆ పార్టీ అంచనా. అయితే రెండు వర్గాలనూ సంతృప్తి పరచడం కత్తిమీద సామేనని భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌ ఆశల పల్లకీలో కాంగ్రెస్‌
­విశ్వాసానికి నిదర్శనమని అంటున్నారు. కాకపోతే బీజేపీ నుంచి కొద్ది నెలల క్రితం వలస వచ్చిన వీరేంద్ర రఘువంశీ వంటి నేతలకు టికెట్లు ఇవ్వకపోవడం చేటు చేయవచ్చని భావిస్తున్నారు. అంతేగాక దిగ్విజయ్‌ కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లివ్వడం కూడా పార్టీలోని ఇతర వర్గాలకు మింగుడు పడటం లేదు. ఇవన్నీ వారి సహాయ నిరాకరణకు దారితీస్తే మొదటికే మోసం రావచ్చన్న భావన కూడా వ్యక్తమవుతోంది.

సమస్యల వలయంలో బీజేపీ
ఇక అధికార బీజేపీని ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పలు ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించే ప్రయ త్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ప్రాధాన్యాన్ని కూడా అధిష్టానం బాగా తగ్గిస్తూ వస్తోంది.

ఆయన్ను తదుపరి సీఎం అభ్యర్థిగా కూడా ఎక్కడా పేర్కొనకుండా జాగ్రత్త పడుతోంది. అంతేగాక కాంగ్రెస్‌కు షాకిచ్చి తమ పార్టీలో చేరడం ద్వారా కమల్‌నాథ్‌ సర్కారు కూలడానికి కారకుడైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కూడా అసెంబ్లీ బరిలో దింపే యోచనలో బీజేపీ ఉంది. శివపురి నుంచి ఆయన పోటీ చేయవచ్చంటున్నారు. ఆయన అత్త యశోధరా రాజె ఆరోగ్య కారణా లతో ఈసారి అక్కడ బరిలో దిగడం లేదు.

ఛత్తీస్‌లో ‘హస్త’వ్యస్తమే!
♦ కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో ఇరు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి. 
♦  దాదాపుగా అన్ని స్థానాలకూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి మరీ బరిలో దిగాయి. ప్రచారాన్నీ హోరెత్తిస్తున్నాయి.
♦  సీఎం భూపేశ్‌ భగెల్‌ అభివృద్ధి మంత్రం జపిస్తుండగా బీజేపీ మాత్రం ఎప్పట్లాగే ప్రధాని మోదీ కరిష్మాను నమ్ముకుంది. 
♦  దానికి తోడు మౌలిక సదుపాయాల కల్పన హామీలను గుప్పిస్తోంది. వీటికి ప్రభుత్వ వ్యతిరేకత తోడై తమనే గట్టెక్కిస్తుందని ఆశపడుతోంది. 
♦ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు తదితరాలను ప్రధానంగా ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. కొంతకాలం క్రితం రాష్ట్రంలో జరిగిన మత కల్లోలాలను కూడా పదేపదే ప్రస్తావిస్తోంది
♦ ఇక కనీసం నాలుగో వంతు ఎమ్మెల్యే లపై తీవ్ర వ్యతిరే కత ఉండటం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది.
♦ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన భగెల్‌ దాన్నే ప్రధానాస్త్రం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. 
♦ మళ్లీ గెలిపిస్తే కులగణన చేపడతామని ఇప్పటికే ప్రకటించారు. పలు ఉచిత పథకాల ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. 
♦  అయితే ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించకపోవడం ఆసక్తికరం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement