ట్రెండింగ్‌గా మారిన అశ్విని.. మరోసారి 23 సెంటిమెంట్‌

Number 23 Sentiment Again Trending In Social Media  - Sakshi

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఒక్కసారిగా అశ్వినీ పేరు మార్మోగిపోతోంది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం నుంచి  వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అశ్వినీ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 1989 నుంచి ఇక్కడ టీడీపీ పార్టీనే వరుసగా గెలుస్తూ వస్తోంది. అలాంటి స్థానంలో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో పెరిగింది.

మరోసారి తెరపైకి 23
వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్య నెలకొన్న పొలిటికల్‌ వార్‌లో 23 నంబర్‌కి ప్రత్యేకత ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. అందులో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తే, టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం అ‍య్యింది. తాజాగా కుప్పంలో టీ సద్దుమూరు స్థానం నుంచి విజయం సాధించి వెలుగులోకి వచ్చిన  అశ్విని వయస్సు కూడా 23 ఏళ్లే కావడం గమనార్హం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top