వారు తిష్ట వేసినా ఫలితం ఉండదు

Niranjan Reddy Fires on Rahul Gandhi JP Nadda Visit to Telangana - Sakshi

నడ్డా, రాహుల్‌పై నిరంజన్‌రెడ్డి ధ్వజం 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ‘తెలంగాణ రాష్ట్రం రాజకీయ ప్రయోగశాల కాదు. ఢిల్లీ నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీలాంటి వాళ్లు వచ్చి ఇక్కడే తిష్ట వేసినా ఫలి తం ఉండదు’అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ అడ్డాలో ఎవరి ఆటలు సాగవన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆయన ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అబద్ధాలతో నిం దిస్తే ప్రజల అభిప్రాయం మారదన్నారు. అపరిపక్వ రాష్ట్ర బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌తో నడ్డా వీధిరౌడీలాగా మాట్లాడారని దునుమాడారు. కేం ద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కేసీఆర్‌కు అవార్డులు ఇస్తే, నడ్డా మాత్రం అవినీతి టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అంటూ విమర్శలు చేయడం చోద్యంగా ఉందన్నారు. సిగ్గు, శరం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేసి నిరూపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నడ్డాకు సిగ్గుంటే 2014లో మోదీ ఇచ్చిన హామీ మేరకు పాలమూరు ఎత్తిపోతలను చేపట్టాలన్నారు. బండి సంజయ్‌ మాటలు డబ్బాలో రాళ్లేసినట్లు ఉంటాయని ఎద్దేవా చేశారు.

సీఎంను ఏక వచనంతో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌ పసుపు బోర్డు తెస్తా నని బాండ్‌ రాసిచ్చి రైతులను మోసం చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ నిన్నటిదాకా సోనియా, రాహుల్‌ను బూతులు తిట్టి మళ్లీ అక్కడే రాజకీయ ఆశ్రయం పొందారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌లో రేవంత్‌ రుడాలి (చనిపోయినప్పుడు ఏడ్చేందుకు వచ్చే అద్దె మనుషులు) పాత్ర పోషిస్తున్నారన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ కాంగ్రెస్‌కు చావు డిక్లరేషన్‌ అవుతుంద న్నారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రం సాధించుకున్నారన్నారు. ‘2018 ఎన్నికల్లో రూ. 2 లక్షల రుణమాఫీ హామీ కాంగ్రెస్‌ ఇచ్చింది.. అయినా ప్రజలు తిరస్కరించారు.. ఇప్పుడదే పాత పాట పాడుతోంది’ అని విమర్శించారు.  సమావేశంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌ పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top