
విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న ముస్లిం కుటుంబం
సి.బెళగల్: ‘యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు.. మా నాన్నకు ఇంతవరకు పింఛన్ రాలేదు. పింఛన్ ఎప్పుడిస్తారు?’అంటూ కర్నూలు జిల్లా సి.బెళగల్‌లో ఓ ముస్లిం కుటుంబం కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రశ్నించింది. సి.బెళగల్‌లో టీడీపీ నాయకులు గురువారం తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోట వీధిలోని అబ్దుల్ సత్తార్ ఇంటికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లిన విష్ణువర్ధన్‌రెడ్డిని అబ్దుల్ కుమార్తెలు తమ తండ్రికి 50 ఏళ్ల పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నింనంచారు. దీనితో టీడీపీ నాయకులు కొంత ఇబ్బంది పడ్డారు.
అదే విధంగా గ్రామ ప్రధాన రోడ్డు, మురికి కాలువలు, మంచినీటి ట్యాంక్ నిర్మాణాల వంటి డిమాండ్లూ గ్రామస్తుల నుంచి వచ్చాయి. కాగా, ఎంపిక చేసిన కొన్ని ఇళ్లను మాత్రమే టీడీపీ నాయకులు సందర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.