‘అమరావతి రైతుల పేరుతో చేసేది కిరాయి ఉద్యమం’

MP MVV Satyanarayana Slams Amaravati Agitation - Sakshi

విశాఖ: అమరావతి రైతుల పేరుతో చేసేది కిరామి ఉద్యమం అని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం చేసేదే అమరావతి ఉద్యమం అని, డబ్బులిచ్చి పచ్చకండవా లేసి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర అనాథిగా వెనుకబడి ఉందని, విశాఖ పరిపాలన రాజధానిగా వస్తే ఉత్తరాంధ్రాలో వెనుకుబాటుతనం పోతుందన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని, విశాఖ పరిపాలన రాజధాని అయితే వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమన్న ఎంపీ సత్యనారాయణ.. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అయితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top