‘చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు’

కృష్ణాజిల్లా: చంద్రబాబు నాయుడు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటేనని మోపిదేవి ఎద్దేవా చేశారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రాయితీపై ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మోపిదేవి.. ‘ సీఎం జగన్ నైతిక విలువలతో రాజకీయాలు చేస్తుంటే, చంద్రబాబు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారు.
రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావటం చంద్రబాబుకు అలవాటు. మామకు వెన్నుపోటు నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వరకు చంద్రబాబుది ఇదే పద్ధతి.చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. 2024లో కూడా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవటం ఖాయం’ అని మోపిదేవి స్పష్టం చేశారు.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు