
సాక్షి, విజయవాడ: కాపు ఉద్యమంలో ముద్రగడ ఏనాడూ లబ్ధి పొందలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాపు ఉద్యమం రాజకీయ లబ్ధి కోసమే అనడం దారుణం.. కాపు ఉద్యమం వల్ల ముద్రగడ రాజకీయంగా నష్టపోయారని ఆయన అన్నారు.
‘‘ముద్రగడ స్ఫూర్తిగా మేమంతా ముందుకెళ్తాం. 30 ఏళ్ల క్రితం ముద్రగడ చేసిన ఉద్యమం ఈ జనరేషన్‌కు తెలియదు. సీఎం అయ్యే అర్హత, సంఖ్యా బలం తనకు లేదని పవన్ చెప్పారు. ఎవరినో అందలం ఎక్కించడం కోసం కాపులు కొట్టుకోవాలా?. 2019లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ నన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. పవన్ మాదిరిగా వ్యక్తిగతంగా మేం మాట్లాడం పవన్ మాపై ఎందుకు కక్ష పెంచుకున్నారో అర్ధం కావట్లేదు’’ అంటూ ఎమ్మెల్సీ తోట వ్యాఖ్యానించారు.
చదవండి: స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్ కౌంటర్