‘చంద్రబాబు ఫోటో పెట్టుకుని సొంత కొడుకే గెలవలేదు’

గన్నవరం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్‌లపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరొకసారి మండిపడ్డారు. ఆడవాళ్లను అడ్డంపెట్టుకుని పబ్బం గడిపేది చంద్రబాబు, లోకేష్‌లు అంటూ వల్లభనేని ధ్వజమెత్తారు. లోకేష్ యువగళానికి స్పందన లేదని విమర్శించారు.
చంద్రబాబు ఫోటో పెట్టుకుని సొంత కొడుకే గెలవలేదని ఎద్దేవా చేశారు వల్లభనేని వంశీ. చంద్రబాబు పెద్ద సైకో అయితే, లోకేష్ చిన్న సైకో అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గన్నవరం నియోజకవర్గంలో దోచుకోవాల్సిన తనకు లేదని చంద్రబాబు, లోకేష్‌ల కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు వల్లభనేని.