బుల్లెట్‌ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్‌.. వీడియో హైలైట్‌

MLA Rajasingh Came To TS Assembly Sessions On Bullet Bike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. కాగా, అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శనివారం అసెంబ్లీ సమావేశాలకు బుల్లెట్‌ బండిపై వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 

వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ అసెంబ్లీ సమావేశాలకు బుల్లెట్‌ బండిపై వచ్చారు. ఈ క్రమంలో రాజాసింగ్‌ను అసెంబ్లీ వద్ద పోలీసులు సరదాగా ఆపి ముచ్చటించారు. ఈ సందర్బంగా రాజాసింగ్‌ మాట్లాడుతూ.. తనకు కొత్త వాహనం కేటాయించడంలేదన్నారు. అందులో భాగంగానే ఇలా నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. కాగా, రాజాసింగ్‌ వాహనం ఇప్పటికే పలుమార్లు మొరాయించిన విషయం తెలిసిందే. అంతుకు ముందు శుక్రవారం రాజాసింగ్.. ప్రగతి భవన్‌ ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసులు రాజాసింగ్‌ను డీసీఎంలో అసెంబ్లీకి తీసుకువచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top