TS: హైకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

MLA Guvvala Balaraju Reacted To The High Court Verdict - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.

దీనిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందిస్తూ.. ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడం అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని గువ్వల ఆరోపించారు. దీనిపై  సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు.
చదవండి: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top