
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు & రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే దీనిని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే.. రాఘవేంద్రరాజు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, శ్రీనివాస్‌గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం కొట్టేసింది. ఇదిలా ఉంటే.. ఖమ్మం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తాజాగా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: అప్పు చేయనిదే నడవని దుస్థితి తెలంగాణది!