Kodali Nani: గెలిచింది మేమే.. బుర్ర పనిచేయడం లేదా?: కొడాలి నాని

Minister Kodali Nani Fires On Chandrababu Over Prior Elections In AP - Sakshi

సాక్షి,  కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు శవరాజకీయాలు చేయడం పుట్టుకతో వచ్చాయని మండిపడ్డారు. ఎవడు చచ్చిపోతాడా.. వాళ్ల శవం దగ్గరకు పోయి రాజకీయం చేద్దామా అని ఎదురుచూస్తాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు శిక్ష విధించినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదని దుయ్యబట్టారు. మహిళా దినోత్సవాన్ని కూడా రాజకీయ సభలా విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసికంగా దెబ్బతిన్న చంద్రబాబుకు మైండ్ చెడిపోయిందని, అసెంబ్లీకి రాకుండా ఇంటిదగ్గర కూర్చున్నాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. అందుకే సంబంధం లేని అంశాలన్నింటినీ జగన్‌పై రుద్ధాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్ చిన్న వయసులో ఉన్నత స్థానానికి వచ్చాడన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేదని, మానసిక స్పృహకోల్పోయి చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లవచ్చని చంద్రబాబు మాట్లాడటంపై కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబుకు మైండ్ చెడిపోయిందంటూ.. బుర్ర పనిచేయడం లేదని విమర్శించారు.

చదవండి: సీఎం జగన్‌ చేతుల మీదగా బీఫాం అందుకున్న రుహుల్లా 

‘రెండున్నరేళ్లలో అన్ని ఎన్నికల్లోనూ గెలిచింది మేమే. సిగ్గులేకుండా కోర్టుకు వెళ్లి 21 మున్సిపాల్టీల ఎన్నికలను అడ్డుకున్నాడు. కోర్టు జడ్జిమెంట్ రాగానే ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 21 మున్సిపాల్టీల్లో ప్రజల తీర్పేంటో చంద్రబాబు చూస్తాడు. ఎన్టీఆర్, వంగవీటి రంగా వంటి వారిని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదు.

ఎన్టీఆర్ కేవలం నిమ్మకూరుకు మాత్రమే చెందిన వ్యక్తి కాదు. విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. అన్ని రకాల సౌలభ్యాలున్న విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడితే తప్పేంటి. విజయవాడ ఏమైనా పక్కదేశంలో ఉందా. జగన్ మోహన్ రెడ్డికి మంచి పేరు రావడం టీడీపీ నేతలు తట్టుకోలేక పోతున్నారు. కావాలనే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.’ అని మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
చదవండి: అమరావతి రైతుల్ని చంద్రబాబు మోసగించారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top