పవన్ మాటలు చూస్తుంటే డీల్ కుదిరిందని అర్థమవుతుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన
సాక్షి, విశాఖపట్నం: పవన్ మాటలు చూస్తుంటే డీల్ కుదిరిందని అర్థమవుతుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన. టీడీపీ, జనసేన నుంచి రాష్ట్రానికి ప్రజలు ఎప్పుడో విముక్తి కల్పించారన్నారు.
చదవండి: ‘పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయింది’
‘‘పవన్ మాటల్లో విముక్తి అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు దూరం చేయడమా?. పవన్ కల్యాణ్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారు. చిరంజీవిని అవమానపరిచేలా పవన్ మాట్లాడుతున్నారు. నిన్ను కొణిదెల పవన్ కల్యాణ్ అనాలా?. నారా పవన్ కల్యాణ్ అనాలా?. నాదెండ్ల పవన్ కల్యాణ్ అనాలా?’’ అంటూ ధ్వజమెత్తారు. అమిత్‌షా వేరే యాక్టర్‌ని పిలిచారని పవన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
