అన్ని రంగాల్లో అసాధారణ పురోగతి

MIM Leader Akbaruddin Comments Over Telangana State - Sakshi

కేసీఆర్, కేటీఆర్‌లకు అక్బరుద్దీన్‌ కితాబు 

పరిశ్రమలు, ఐటీ రంగంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ 

హైదరాబాద్‌ పాతబస్తీకి కూడా భాగస్వామ్యం కల్పించండి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వల్ప కాలంలోనే అబ్బురపరిచే ప్రగతిని సాధిస్తూ అన్ని రంగాల్లో అసాధారణ పురోగతి సాధిస్తోందని అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అసెంబ్లీలో సోమవారం ఐటీ, పరిశ్రమల రంగంలో ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్బంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేయడం, మిషన్‌ కాకతీయతో చెరువుల్ని పునరుద్ధరించటం ద్వారా పంటలు సమృద్ధిగా పండుతుండటం తో రైతులు సుఖంగా ఉన్నారని అక్బరుద్దీన్‌ చెప్పా రు.

దేశమంతా ముక్కున వేలేసుకునే విధంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ ఒకవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే, పారిశ్రామిక రంగా నికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పరిశ్ర మలు, ఐటీ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారినందుకు హైదరాబాదీగా గర్వపడుతున్నానన్నారు. ఈ అభివృద్ధిలో హైదరాబాద్‌ పాతబస్తీని కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.

కేటీఆర్‌ కృషి అసామాన్యం 
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు తమ ద్వితీయ క్షేత్రం గా హైదరాబాద్‌ను ఎంచుకోవటం వెనుక మంత్రి కేటీఆర్‌ కృషి అసామాన్యమైందని అక్బరుద్దీన్‌ ప్రశంసించారు. గతంలో ఐటీ అంటే బెంగళూరుగా స్థిరపడిపోయిన స్థితిని తిరగరాసి రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలబడిందని చెప్పారు.  

ఐటీ టవర్‌ నిర్మించండి 
శంషాబాద్‌ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న 50 ఎకరాల వక్ఫ్‌బోర్డు స్థలం కబ్జాదారుల ఆగడాలకు పరాధీనం కాబోతోందని అక్బరుద్దీన్‌ తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మైనారిటీ యువత కోసం అందులో ఐటీ టవర్‌ నిర్మించాలని కోరారు.  కాగా, ఎస్సీ, ఎస్టీలకు టి ప్రైడ్‌ కింద ఇన్సెంటివ్స్‌ ఇస్తున్నట్టే మైనార్టీ ఎంటర్‌ప్రెన్యూర్లకు సహకరించాలని అక్బరుద్దీన్‌ కోరారు. హైదరాబాద్లో ఫ్రీ వైఫై అన్నారని, కరోనా టైంలో పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు వినేం దుకు నాలుగైదు గంటలు ఫ్రీ వైఫై ఇవ్వాలన్నారు.

తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో ఇక్కడి యువతకే 50 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేయా లని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పాతబస్దీలో కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరారు.    

భారీ పెట్టుబడులు వస్తున్నాయ్‌: వివేకానంద 
రాష్ట్రంలోని సుస్థిర ప్రభుత్వం, శాంతియుత వాతావరణం వల్ల భారీ పెట్టుబడులు వస్తున్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద చెప్పారు. పరిశ్రమలు,  అంతకుముందు పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలపై చర్చ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని, రాజాసింగ్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. గృహనిర్మాణ సంస్థ, ఉద్యాన వర్సిటీ, పంచాయతీరాజ్, నల్సార్‌ చట్ట సవరణల బిల్లులను మం త్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top