
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీల మధ్య వివాదం మరోసారి రచ్చకెక్కింది. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీఎంసీ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ-మహువా మొయిత్రాల మధ్య రగడ హద్దులు దాటింది. తాజాగా టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై మరో టీఎంసీ ఎంపి కళ్యాణ్ బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక టైమ్ వేస్ట్ మనిషి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇటీవల లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ చీప్ విప్ పదవికి రాజీనామా చేసిన కళ్యాణ్ బెనర్జీ.. మహువా మొయిత్రా టార్గెట్‌గా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ ఆమె గురించి మాట్లాడి నా విలువైన సమయాన్ని వృథా చేసుకోను. ఆమె ఒక వేస్ట్. నేను దృష్టి సారించేంతగా ఆమెకు ఏ లక్షణాలు లేవు. ఆమె కారణంగా నేను చాలా మంది వద్ద చెడ్డవాడిగా మారిపోయాను. ఇప్పుడు మరోసారి ఆమె గురించి మాట్లాడటం అనవసరం. నా సమయం వేస్ట్ చేయకండి’ అంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈ క్రమంలోనే తన అడ్వొకేట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘ నా అడ్వొకేట్ నాకు ఒక మెస్సేజ్ చేశారు. నేను దానితో స్ఫూర్తి పొందాను. నేను ఎక్కువగా దృష్టి నిలపాల్సిన స్థాయి మొయిత్రాకు లేదు. నాకు ఇప్పుడు చాలా పని ఉంది’ అంటూ పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది జూన్ నెలలో కళ్యాణ్ బెనర్జీ మహిళా ద్వేషి అంటూ మొయిత్రా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆమె చేసిన వ్యాఖ్యలపై కళ్యాణ్ బెనర్జీ అగ్గిమీడ గుగ్గిలమయ‍్యారు. ‘ ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? అంటూ నిలదీశారు. ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
మొయిత్రా వ్యాఖ్యలపై కళ్యాణ్ బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. 'ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
వీరిద్దరూ బహిరంగంగా పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు గతంలో కూడా చాలానే ఉన్నాయి.