
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సామాజిక సమీకరణాల ఆధారంగా.. 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఎంపీ అభ్యర్థుల పేర్లను ఎంపీ నందిగం సురేష్ చదివి వినిపించారు. అనకాపల్లి ఎంపీ స్థానం పెండింగ్‌లో ఉంది. 25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు.
ఏ సామాజిక వర్గానికి ఎన్ని?
- ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు అన్నీ కలిపి 200 సీట్లు
- ఎస్సీలకు 33
- ఎస్టీలకు 8
- బీసీలకు 59
- మొత్తం వెనుకబడిన వర్గాలకు సీట్లు 100
- గతంలో కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అదనంగా 11 సీట్లు
విద్యార్థతలు
- 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే.
- ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు.
- 25 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు.
- ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టిషనర్.
ఇదీ చదవండి: YSRCP సిద్ధం : 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా