పాలమూరు కాంగ్రెస్‌లో టికెట్‌ ప్రకంపనలు..

leaders leaving congress party in mahbubnagar district - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : పాలమూరు కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టిక్కెట్లు ఆశించి భంగపడినవారు హస్తం గూటిని వీడుతున్నారు. రాత్రికి రాత్రే కొందరు అసమ్మతి నేతలు కండువాలు మార్చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి సొంత జిల్లాలో ఆయనకు షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ వచ్చిన సమయంలోనే నాగం జనార్థనరెడ్డి గులాబీ కండువా  కప్పుకున్నారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో కారు పార్టీలో జోష్ పెంచుతోంది. పాలమూరు రాజకీయాలు వస్తున్న మార్పులు ఏంటి ? 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసంతృప్త నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీకి గుడ్‌బై చెప్పి కారెక్కుతున్నారు. ఈ పరిణామాలు వేగంగా సాగుతుండటంతో జిల్లా రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత కాంగ్రేస్‌ పార్టీలో చేరటంతో గులాబీ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కాంగ్రేస్‌లో చేరిపోయారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులకు సంబంధించి మొదటి జాబితాలో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌, గద్వాల సీట్లు ఆశించిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి దక్కడంతో నాగం జనార్థనరెడ్డి, జగదీశ్వరరావులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నాగం ఇప్పటికే కేసీఆర్‌ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిపోయారు. మరికొందరు నేతలు కూడా తమ అనుచరుతలతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. 

తనకు సీటు రాకపోవటంతో ఆగ్రహంగా ఉన్న నాగంకు అధికార పార్టీ నేతలు గాలం వేశారు. మత్రులు కేటీఆర్‌..హరీష్ రావులు నాగంను కలిసి మంతనాలు జరపడం.. పార్టీలోకి ఆహ్వానించటం అందుకు ఆయన సమ్మతించటం ...వెంటనే నాగం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవటం చకచకా సాగిపోయాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ కూడా టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించారు. ఎర్ర శేఖర్‌కు జడ్చర్ల కాకుండా చివర్లో నారాయణపేట నుంచి పోటీచేయాల్సిందిగా పార్టీ పెద్దలు సూచించారు. ఎర్ర శేఖర్‌ అందుకు నిరాకరించారు. చివరికి ఎర్ర శేఖర్‌ను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.ఆర్‌ రెడ్డి సంప్రదించి..కేటీయార్‌ సమక్షంలో పార్టీలో చేర్చుకున్నారు. వనపర్తిలో సీటు ఆశించి భంగబడ్డ మెగారెడ్డికి మద్దతుగా వనపర్తిలో కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని మెగారెడ్డికి ఆయన అభిమానులు సూచించారు. మీ అభిష్టం మేరకే నడుచుకుంటానని మెగారెడ్డి ప్రకటించారు. 

దేవరకద్ర నుంచి సీటు ఆశించిన కొండా ప్రశాంత్‌రెడ్డి సైతం తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు. కాంగ్రేస్ అభ్యర్ది మధుసూధన్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. మరోవైపు సోమవారం నాడు దేవరకద్ర అభ్యర్థిని మార్చాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో విధ్వంసం సృష్టించారు. మక్తల్‌ సీటు ఆశించిన నేత కూడా అనుచరులతో మాట్లాడి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇలా ఎక్కడికక్కడ అసంతృప్త నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇలా అన్ని చోట్లా రెబల్స్‌ బరిలో దిగితే కాంగ్రేస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంటుందని పార్ఠీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్న వేళ తాజా ఘటనలు నేతల్ని కలవరపెడుతున్నాయి. స్వంత జిల్లాలో అధిక స్దానాలు గెలవాలని  భావించిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి నేతలు పార్టీని వీడటం తలనొప్పిగా మారింది.

ఇన్నాళ్లూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాస్త వెనకబడిందనుకున్న అధికార పార్టీకి ఒకేరోజున పెద్దస్థాయిలో కలిసి వచ్చింది. బీజేపీ నేత పి.చంద్రశేఖర్‌..కాంగ్రెస్ నేతలు నాగం జనార్థనరెడ్డి, ఎర్ర శేఖర్‌లు గులాబీ పార్టీలో చేరడం వారికి సముచిత స్థానం ఉంటుందన్న సంకేతాలు పార్టీ పెద్దలు ఇస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరుగుతోంది. ఇటీవలే..వనపర్తికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు..మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడ బీఆర్ఎస్ పార్టీలో చేరటం బీయారెస్‌కు కలిసివచ్చే అంశాలుగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతల్ని బీఆర్ఎస్ నాయకత్వం వెంటనే సంప్రదించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీల్లోకి నాయకుల రాకపోకలతో కింది స్థాయి వరకు మార్పులు జరుగుతాయా? లేక అక్కడితో ఆగిపోతాయా? అనేది చూడాలి.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-11-2023
Nov 13, 2023, 09:08 IST
'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు.  ఈ నానుడికి ఆ నియోజకవర్గం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ఇప్పుడు...
13-11-2023
Nov 13, 2023, 08:26 IST
సాక్షి,తెలంగాణ:  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. తమ కుటుంబం నుంచి చట్టసభకు ఎన్నికవుతున్నారంటే ఎవరికి...
13-11-2023
Nov 13, 2023, 08:05 IST
ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రమాదకరంగా తయారయ్యారు. అధికార గులాబీ పార్టీ అభ్యర్థికే ఈ...
13-11-2023
Nov 13, 2023, 08:01 IST
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి....
13-11-2023
Nov 13, 2023, 07:54 IST
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని...
12-11-2023
Nov 12, 2023, 15:51 IST
సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌ గూండాలు తనపై దాడి చేశారని, తన  కాన్వాయ్‌ని వెంబడిస్తూ దాడి చేశారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...
12-11-2023
Nov 12, 2023, 13:58 IST
సాక్షి,హైదరాబాద్‌ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు...
12-11-2023
Nov 12, 2023, 13:48 IST
సాక్షి, నిజామాబాద్‌/కామారెడ్డి: కామారెడ్డిలో 29 ఏళ్లుగా గంప గోవర్ధన్‌, షబ్బీర్‌ అలీల మధ్య ఎన్నికలు ఉద్ధండుల మధ్య సమరంలా జరిగేవి. ఇద్దరికీ...
12-11-2023
Nov 12, 2023, 13:01 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: 'బోధన్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ ఆమేర్‌పై పార్టీ కేడర్‌లో తీవ్ర అసమ్మతి నెలకొనగా, ఆయన తీరుపై...
12-11-2023
Nov 12, 2023, 12:24 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియగా, ప్రధాన పార్టీల అభ్యర్థులకు చాలా వరకు రెబల్స్‌ బెడద...
12-11-2023
Nov 12, 2023, 10:57 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఐదేళ్లకోసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల పండుగకు ఈసారి దీపావళి తోడైంది. ఈ వేడుకలు అనగానే పిల్లల నుంచి...
12-11-2023
Nov 12, 2023, 10:12 IST
సాక్షి, ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ఎ...
12-11-2023
Nov 12, 2023, 09:53 IST
సాక్షి, ఆదిలాబాద్‌: శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీదే ఉమ్మడి...
12-11-2023
Nov 12, 2023, 02:42 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘కమ్యూనిస్టులను కేసీఆర్‌ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమే. ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు ఒకే...
12-11-2023
Nov 12, 2023, 00:56 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ సీఎం కేసీఆర్‌కు ఓటమి తప్పదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర...
12-11-2023
Nov 12, 2023, 00:49 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నెల...
11-11-2023
Nov 11, 2023, 21:06 IST
గజ్వేల్‌లో రకరకాలుగా తమ నిరసన తెలిపే క్రమంలో బాధితులంతా కేసీఆర్‌పై పోటీకి దిగారు. వాళ్లలో ధరణి బాధితులు.. 
11-11-2023
Nov 11, 2023, 17:56 IST
‘‘మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. 
11-11-2023
Nov 11, 2023, 17:35 IST
బీఆర్‌ఎస్‌ అంటే పంట కోతలు.. కాంగ్రెస్‌ అంటే కరెంట్‌ కోతలు.. 
11-11-2023
Nov 11, 2023, 15:10 IST
సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మంత్రి తలసాని యాదవ్‌ మండిపడ్డారు. రేవంత్‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు.... 

Read also in:
Back to Top