Kumbham Anil Kumar: మళ్లీ కాంగ్రెస్‌ గూటికి కుంభం.. రెండు నెలలకే యూటర్న్‌ 

Kumbham Anil set to return to Congress just 2 months after joining BRS - Sakshi

రేవంత్‌ సమక్షంలో చేరిక.. రెండు నెలలకే యూటర్న్‌ 

బీఆర్‌ఎస్‌లో గుర్తింపు లేదన్న భావన  

సాక్షి, యాదాద్రి: రెండు నెలల క్రితం బీఆర్‌ఎస్‌లో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం రాత్రి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వనించారు. ఇందుకు కుంభం సానుకూలంగా స్పందించడంతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పారు.దీంతో అని ల్‌కుమార్‌రెడ్డి తిరిగి సొంత గూటికి చేరినట్లయింది.

డీసీసీ అధ్యక్షుడి హోదాలో స్వయంగా సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తనకు సరైన గుర్తింపు, ప్రజల్లోకి వెళ్లడానికి ప్రొటోకాల్‌ లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీతో పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్తున్నాడన్న సమాచారంతో మంత్రులు సోమవారం ఫోన్‌లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. కాగా, రెండు నెలల క్రితం జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నానని కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top