సురేఖ బర్తరఫ్‌.. కొండా మురళి సంచలన ట్వీట్‌ | Konda Murali Reaction After Surekha Dropped From Cabinet | Sakshi
Sakshi News home page

సురేఖ బర్తరఫ్‌.. కొండా మురళి సంచలన ట్వీట్‌

Sep 3 2026 8:54 PM | Updated on Sep 3 2026 9:09 PM

Konda Murali Reaction After Surekha Dropped From Cabinet

సాక్షి, హైదరాబాద్‌: కొండా సురేఖ భర్త మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాకు ఇదేం కొత్త కాదన్న మురళి.. ఇవాళ మేము.. రేపు ఎవరో? అంటూ వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నా లేకున్నా మా గౌరవం మాకు ఉంటుంది. మేం ప్రతిదానికి స్పందించకపోవచ్చు.. కానీ అన్నీ గమనిస్తూనే ఉంటాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు’’ అంటూ కొండా మురళి ట్వీట్‌ చేశారు. అంతకుముందు హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా ముందు కొచ్చిన కొండా మురళి.. మీసం మెలేశారు.

హైదరాబాద్‌ లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు లోక్‌భవన్‌కు పలువురు క్యాబినెట్ మంత్రులు వెళ్లారు. కొండా సురేఖ బర్తరఫ్‌, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై గవర్నర్‌కు సీఎం వివరించారు. గవర్నర్‌తో సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement