రైతుల కోసం పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌ | KTR Issues Stern Warning To Government On Water Schedule | Sakshi
Sakshi News home page

రైతుల కోసం పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

Sep 3 2026 6:17 PM | Updated on Sep 3 2026 7:33 PM

KTR Issues Stern Warning To Government On Water Schedule

నల్లగొండ: గతంలో నీళ్ల కోసం కోదాడ నుంచి హాలియా వరకూ కేసీఆర్‌ పాదయాత్ర చేశారని, ఇప్పుడు వినాయక చవిత లోపల నీటి షెడ్యూల్‌ను విడుదల చేయకపోతే  అదే కోదాద నుంచి హాలియా వరకూ తాను పాద్రయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. కేసీఆర్‌ పాలనలో రైతులు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ఇప్పటివరకూ వెయ్యి రోజుల పడకల పాము పాలన చూశామని విమర్శించారు కేటీఆర్‌

ఈరోజు(గురువారం, సెప్టెంబర్‌3వ తేదీ) నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో రైతు ధర్నాలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ మాట్లాడుతూ.. మిర్యాలగూడలో రైతు ధర్నాను అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. 

‘పచ్చని పొలాలతో ఉన్న మిర్యాలగూడ ప్రాంతంలో రైతు మహా ధర్నా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలి. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ ఇచ్చిన హామీ ఏమైంది?, రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా రూ. 15 వేలు ఏమైంది?, రైతు బంధు, రైతు బీమా ఎగ్గొట్టింది ఎవరు?, పంటలకు నీళ్లు ఇవ్వమంటే బీఆర్ఎస్ వాళ్ల రక్తం చల్లుతానని రేవంత్ అంటున్నారు. 

సాగర్‌లో నీళ్లు ఉన్నా పంటలకు నీళ్లు ఇవ్వాలనే సోయి జిల్లాలో ఉన్న మంత్రులకు లేదు. ఉత్తమ్ నీళ్ల మంత్రి కాదు. రైతుల కళ్లలో నీళ్లు నింపుతున్న మంత్రి. ఎంతటి కరువు పరిస్థితి ఉన్నా గతంలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం. నీకు ఓట్లేయడమే ఎడమ కాలువ రైతులు చేసిన తప్పా. ఓటేసిన పాపానికి రైతాంగానికి అన్యాయం చేస్తోంది. రైతులకు యూరియా కూడా దొరకడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement