తెలంగాణ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ అయిన మంత్రి కొండా సురేఖ కుమార్తె గురించి ఆమె కుమార్తె కొండా సుస్మిత స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇటీవల తాను చేసిన విమర్శలు తన వ్యక్తిగత హోదాలో చేసినవేనని, ఏ రాజకీయ పార్టీనీ ఉద్దేశించి చేసినవి కావని స్పష్టం చేశారు.
సీఎన్‌ఎన్-న్యూస్18తో గురువారం సుస్మిత మాట్లాడారు. “నా ప్రకటన వ్యక్తిగతమైనది. ఏ పార్టీకి వ్యతిరేకంగా కాదు. నేను నా వ్యక్తిగత హోదాలో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాను” అని తెలిపారు. తన తల్లికి ఎదురైన పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నా తల్లికి అన్యాయం జరిగింది. నా తల్లిని ఇలా చూసినందుకు నేను తీవ్రంగా బాధపడ్డాను” అని అన్నారు.
రేవంత్ రెడ్డికి సుస్మిత సవాల్
తన తల్లి కోసం తాను ఎప్పటికీ మద్దతుగా నిలబడతానని సుస్మిత స్పష్టం చేశారు. “నా తల్లి మౌనంవహించేలా ఎవరూ చేయలేరు. నేను రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను” అని అన్నారు. రేవంత్ రెడ్డికి సుస్మిత సూటిగా సవాల్ కూడా విసిరారు. “నా తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నాను” అని అన్నారు. పరకాల అసెంబ్లీ స్థానం, తన తల్లికి సంబంధించిన రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదం ముదురుతున్న సమయంలో సుస్మిత ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొండా సురేఖను తక్షణమే తన మంత్రివర్గం నుంచి తొలగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి నియామకాన్ని కూడా రద్దు చేశారు. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే నిర్ణయాన్ని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కార్యాలయానికి ఇప్పటికే తెలియజేశారు.
పార్టీకి చెందిన సీనియర్ నేతలపై సుస్మిత, చిన్నారెడ్డి ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. వారి వ్యాఖ్యలను పలువురు పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇద్దరు నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని అన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చూడకూడదని చెప్పారు. అయినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు మంత్రిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.


