అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Published Sun, Oct 29 2023 11:41 AM

Komatireddy Venkat Reddy Comments On Brs Party - Sakshi

సాక్షి, నల్గొండ జిల్లా: తాను సిద్దిపేటలో పోటీ చేసేది లేదని, తమ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని.. కానీ అలాంటి ప్రయోగాలు చేస్తుందని తాను అనుకోనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నల్గొండలోనే పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.

‘‘కర్ణాటకలో అమలవుతున్న పథకాలను పర్యవేక్షించేందుకు కర్ణాటక వెళ్దాం. బీఆర్ఎస్ నేతల కోసం హెలికాప్టర్ కూడా సిద్ధం చేశాను. బావ, బామ్మర్థులు ఎవరు వస్తారో తెల్చుకోండి. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో కర్ణాటక ప్రజల్ని అడుగుదాం. సంక్షేమ పథకాలు అందడం లేదని కర్ణాటక ప్రజలు చెప్తే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా’’ అంటూ కోమటిరెడ్డి సవాల్‌ విసిరారు. 

‘‘బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారు. 5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేదు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే తొమ్మిది ఏళ్లుగా బాగుపడ్డారు. కేసీఆర్ సొంత కులస్తులు కూడా తెలంగాణలో బాగుపడలేదు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకు నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ధరణితో ఎవరు బాగుపడ్డారో కేసీఆర్ చెప్పాలి’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు.
చదవండి: వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

Advertisement
 
Advertisement