
తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే వృధా అయినట్టేనంటూ వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.
సాక్షి, మెదక్: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే వృధా అయినట్టేనంటూ వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. ఆదివారం ఆయన తూప్రాన్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను అవినీతి పార్టీలుగా అభివర్ణించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తాం. హైదరాబాద్‌లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ని ఒడిస్తామన్నారు.
రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లి పోతారంటూ కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఇంకో రెండు నెలలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాయకులను గ్రామాల్లో తిరగనివ్వం’ అంటూ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి కవిత లేఖ