టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్‌ ఓ దద్దమ్మ: కాపు రామచంద్రారెడ్డి | Kapu Ramachandra Reddy Comments On Kalava Srinivasulu - Sakshi
Sakshi News home page

టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్‌ ఓ దద్దమ్మ: కాపు రామచంద్రారెడ్డి

Dec 26 2023 3:23 PM | Updated on Dec 26 2023 3:48 PM

Kapu Ramachandra Reddy Comments On Kalva Srinivas - Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్‌ ఓ దద్దమ్మ అని, రాయదుర్గంను అభివృద్ధి చేయలేకపోయారంటూ ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ పాలనలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని.. రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్‌ బ్రోకర్‌ పని చేశారంటూ దుయ్యబట్టారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజూ ఫొటోలు పెడతా. సాగు, తాగునీటిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్‌ అబద్ధాలు చెబుతున్నారు. సీఎం జగన్‌ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశా. 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించాను. 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: డబ్బు కుమ్మరిస్తేనే టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement