కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు? | Kanhaiya Collected RS 52 Lakh for Campaign, Know Details Of How Many People Donated | Sakshi
Sakshi News home page

కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?

Published Thu, May 23 2024 9:20 AM

Kanhaiya Collected RS 52 Lakh for Campaign

ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి మనోజ్‌ తివారి, కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ మధ్య పోరు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతగా రాజకీయాల్లో కాలుమోపిన కన్హయ్య ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నారు.

కన్హయ్య కుమార్‌ తన ప్రచార ఖర్చుల కోసం గడచిన ఏడు రోజుల్లో రూ. 52 లక్షలను క్రౌడ్‌ ఫండింగ్‌ రూపంలో సేకరించారు. ఆయన మే 15 నుంచి ఫ్యూయల్‌ డ్రీమ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా చందాలను స్వీకరించడం ప్రారంభించారు. బుధవారం రాత్రి నాటికి కన్హయ్య కుమార్‌కు మొత్తం 2,250 మంది రూ. 52 లక్షలను చందాల రూపంలో అందించారు. కన్హయ్యకు చందాలు ఇచ్చిన వారిలో హాస్య కళాకారుడు కుణాల్‌ కుమార్‌, సినీ నిర్మాత విశాల్‌ భరద్వాజ్‌, అతని భార్య, గాయని రేఖా భరద్వాజ్‌, జెఎన్‌యూ మాజీ ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌, మాజీ ప్రొఫెసర్‌ మోహన్‌రావు తదతరులు ఉన్నారు.

కన్హయ్య కుమార్‌ ‘క్రౌడ్‌ ఫండింగ్‌’ రూపంలో మొత్తం రూ. 75 లక్షలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ ఫండ్‌ సేకరణకు ముందు కన్హయ్య కుమార్‌ ఒక వీడియో విడుదల చేస్తూ తాను శాంతి, ప్రగతి, న్యాయం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నానని పేర్కొన్నారు. ఫ్యూయల్‌ డ్రీమ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా తాను చందాలు సేకరిస్తున్నానని, అలాగే గూగుల్‌ పే నంబర్‌ ద్వారా కూడా చందాలు సేకరిస్తున్నానని తెలియజేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement