
రైతుల నిరసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వారం రోజుల వ్యవధిలో రెండోసారి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.ఈ భేటీలో ఏం చర్చ జరింగిందన్న అంశంపై పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఈ వారం ప్రారంభంలో కేంద్రం వెనక్కి తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. రైతుల నిరసనపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని సొంత పార్టీ ఖండించింది.
అదే సమయంలో ఆమె స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) పేర్కొంది.ఈ మేరకు కంగన సహా పలువురికి లీగల్ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో కంగనా జేపీ నడ్డాతో భేటీ అవ్వడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
दिल्ली: जेपी नड्डा के आवास पहुंचीं कंगना रनौत, किसान आंदोलन पर कंगना ने बयान से बीजेपी पार्टी के नेता नाराज़ थे।
जिसके चलते बीजेपी ने पार्टी लाइन से हटकर बयानबाजी न करने की नसीहत भी दी थी। #Delhi @JPNadda #KanganaTeam pic.twitter.com/9r6nxypRnx— Ashutosh Tripathi (@tripsashu) August 29, 2024