దున్నపోతుపై వర్షం పడినట్టుంది రామోజీ వ్యవహారం: జోగి రమేష్‌ ఫైర్‌

Jogi Ramesh Serious Comments On Eenadu And Ramoji Rao - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఈనాడు రామోజీరావు, టీడీపీపై మంత్రి జోగి రమేష్‌ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి అంటూ సవాల్‌ విసిరారు. దున్నపోతుపై వర్షం పడినట్టు రామోజీ వ్యవహారం ఉందని తీవ్ర విమర్శలు చేశారు. 

కాగా, జోగి రమేష్‌ మీడియాతో​ మాట్లాడుతూ.. ‘ఈనాడు పత్రికపై ప్రజా వ్యతిరేకత మొదలైంది. ప్రజలు ఎల్లో మీడియాను దహనం చేస్తారు. రామోజీ అండ్‌ కో ప్రతీరోజు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. 32 పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మన్ననలు పొందారు. సంక్షేమం అంటే ఏవిధంగా ఉంటుందో చూపించాం. సామాజిక న్యాయం ఏంటో చూపించాం. దున్నపోతుపై వర్షం పడినట్టు రామోజీ వ్యవహారం ఉంది. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి. అసెంబ్లీ సాక్షిగా సామాజిక న్యాయంపై చర్చిద్దాం. 

ఈనాడు తప్పుడు వార్తలపై నిరసనలు తెలిపాము. ఈరోజు ఐదుగంటలలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాము. కానీ, ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు. దీంతో, ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. రామోజీ వికృత జర్నలిజం దహించిపోయే రోజులు వచ్చాయి. ఎవరేం చేశారో చర్చకు రావాలి. ఇదే నా సవాల్.  అసెంబ్లీకి రా తేల్చుకుందాం, ఏ అంశం మీదైనా మాట్లాడుదాం. బాలకృష్ణ డైలాగులు రాసిస్తే లోకేష్‌ చెప్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top