జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్‌ | Like Joe Biden, PM Modi is also losing his memory: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్‌

Nov 16 2024 6:05 PM | Updated on Nov 16 2024 6:49 PM

Like Joe Biden, PM Modi is also losing his memory: Rahul Gandhi

ముంబై:  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ లాగే ప్రధాని మోదీక  జ్ఞాపకశక్తి కోల్పోతున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోదీ తరుచూ మాట్లాడుతున్నారని  మండిపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌మాట్లాడుతూ.. బిడెన్ (81) పొరపాటున ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేసిన సంఘటనను ప్రస్తావించారు.

‘ప్రధానిమోదీ ప్రసంగం విన్నట్లు మా సోదరి ప్రియాంక నాతో చెప్పింది. ఆయన ఆ స్పీచ్‌లో కాంగ్రెస్‌ ఏం మాట్లాడుతుతోందే దానిపైనే మోదీ మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఆయనకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందేమో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వస్తే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తప్పుగా అన్నారు. అతను తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. అలాగే మన ప్రధాని కూడా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. 

గత ఏడాది కాలంగా నా ప్రసంగాల్లో రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని చెబుతున్నా.. కానీ కాంగ్రెస్ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ చెబుతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని తెలిసి ఇప్పుడు ఆయన నేను రాజ్యాంగంపై దాడి చేస్తున్నాను అని అబద్దాలు చెబుతున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రద్దు చేస్తామని లోక్‌సభలో కూడా చెప్పాను. కానీ మోదీ ఇప్పటికీ రాహుల్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెబుతున్నారు. అందుకే ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారని అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement