
వీరిద్దరూ తాజాగా మరోసారి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చర్చించినట్లు సమాచారం.
సాక్షి, హైదరాబాద్: ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తాము కలిసి ఉన్నామన్న సంకేతం పంపడం ద్వారా అయినా తమ విజయావకాశాలు పెంచుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. అందువల్లే రాజకీయ విలువలతో నిమిత్తం లేకుండా వీరిద్దరూ తరుచూ భేటీ అవుతున్నారు. గతంలోనూ చంద్రబాబు నివాసం, నోవా హెటల్‌లో ఇద్దరూ భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ తాజాగా మరోసారి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చర్చించినట్లు సమాచారం.
అయితే, ఈ సమావేశంలో ఇద్దరి మధ్య సీట్ల పంపకం గురించి చర్చ జరిగిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో టీడీపీతో పొత్తు గురించి పవన్ చర్చించగా, ఆ ప్రతిపాదనను బీజేపీ జాతీయ నాయకులు తిరస్కరించిన సంగతి విధితమే.
అంబటి సెటైర్లు..
చంద్రబాబు, పవన్‌లకు ట్విటర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. వీరి భేటీపై స్పందిస్తూ.. ‘‘కలవడానికి ఎందుకంత తొందర, ఎదర బ్రతుకంతా చిందరవందర’’ అంటూ ట్విట్ చేశారు.
కలవడానికెందుకురా తొందరా !
— Ambati Rambabu (@AmbatiRambabu) April 29, 2023
ఎదర బ్రతుకంతా చిందర వందర !! @ncbn @PawanKalyan
చదవండి: ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించడంలో రజనీకాంత్ పాత్ర: మంత్రి జోగి రమేష్