తనయుడిని గెలిపించిన తల్లి.. జైలు నుంచే జయభేరి

Jailed Activist Akhil Gogoi Wins Assam Polls From Sibsagar Constituency - Sakshi

సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు అఖిల్‌ గొగోయ్‌ విజయం

జైలు నుంచే బరిలో నిలిచి గెలిచాడు

డిస్పూర్‌: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన... ప్రచారంలో పాల్గొనకుండానే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందారు. గొగోయ్‌కు మొత్తం 57,219 ఓట్లు రాగా.. మొత్తం 46.06 శాతం ఓటర్ల మద్దతు ఆయనకు లభించింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం అభియోగాల కింద 2019లో గొగోయ్‌‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గొగోయ్‌ గువహటి మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్సిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

అఖిల్ గొగోయ్ గత ఏడాది అక్టోబర్‌లో రైతు సంస్థ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్), కొన్ని యాంటీ సీఏఏ సంస్థల మద్దతుతో రైజోర్ దళ్‌ను స్థాపించారు. అస్సాంలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు రైజోర్ దళ్ కొత్తగా ఏర్పడిన మరో పార్టీ అస్సాం జాతియా పరిషత్ (ఏజేపీ) తో కలిసి 18 స్థానాలకు పోటీ చేసింది. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచినప్పటికీ... ఎన్నికల్లో మాత్రం సుభ్రామిత్ర గొగోయ్‌కు టిక్కెట్ ఇచ్చింది. దాంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు.  

కుమారుడి తరఫున రంగంలోకి దిగిన తల్లి...
ఇక ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోవడంతో.. గొగోయ్ జైలు నుంచే ప్రజా సమస్యలపై అనేక బహిరంగ లేఖలు రాశారు. దీనికితోడు జైల్లో ఉన్న తన కుమారుడి కోసం 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియదా గొగోయ్.. శిబ్‌సాగర్‌లోని గల్లీల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. కుమారుడి కోసం ఆమె చేస్తున్న పోరాటానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేథా పాట్కర్, సందీప్ పాండే మద్దతు తెలిపారు. శిబ్‌సాగర్‌కు తరలివచ్చి ప్రియదా గొగోయ్‌తో కలిసి ప్రచారం చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కొన్వర్‌ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంటి అగ్రనేతలను సైతం రంగంలోకి దించినా.. గొగోయ్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది.

ఈ సందర్భంగా అఖిల్‌ గొగోయ్‌ భార్య మాట్లాడుతూ.. ‘‘అసోం శిబ్‌సాగర్‌ జనాలు అఖిల్‌ మీద పెంచుకున్న ప్రేమ, ఆప్యాయతలే తనని గెలిపించాయి. ఈ విజయం మా అందరి బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా శిబ్‌సాగర్‌ జనాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ, ఆప్యాయత వల్లనే అఖిల్‌ గొగోయ్‌ విజయం సాధించారు. అసోం చరిత్రలో ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే ఇంతవరకు జైలుకెళ్లిన వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించిన ఘటనలు ఎక్కడా లేవు’’ అన్నారు. 

ఏవరీ అఖిల్‌ గొగోయ్‌...
గువాహటిలోని కాటన్ కాలేజి నుంచి పట్టభద్రుడైన 46 ఏళ్ల గొగోయ్.. రాజకీయాలకు కొత్తేం కాదు. 1995-96 మధ్య ఆయన కాటన్ కాలేజి స్టూడెంట్ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనేక ఏళ్లుగా అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్) వేదికగా అనేక పోరాటాలకు నేతృత్వం వహించారు. 2019 డిసెంబర్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం హింసకు దారితీయడంతో.. దీని వెనుక గొగోయ్ హస్తం ఉందంటూ ఎన్ఐఏ అధికారులు తనను అరెస్ట్ చేశారు. 

చదవండి: అస్సాంలో కమలదళానికి కఠిన పరీక్ష

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 04:35 IST
కోల్‌కతా: హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయఢంకా మోగించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్‌...
05-05-2021
May 05, 2021, 01:05 IST
బీజేపీ అజేయశక్తి కాదని, ఆ పార్టీని ఓడించవచ్చని బెంగాల్‌ ఎన్నికలు నిరూపించాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ...
04-05-2021
May 04, 2021, 06:25 IST
శివసాగర్‌(అస్సాం): పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక ఉద్యమకారుడు, సమాచార హక్కు చట్టం కార్యకర్త అఖిల్‌ గొగోయ్‌(46) జైల్లో ఉంటూ అస్సాంలో...
04-05-2021
May 04, 2021, 06:14 IST
గవర్నర్‌ సూచన మేరకు ఈ నెల 7న రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
04-05-2021
May 04, 2021, 04:59 IST
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్ల జంట అసెంబ్లీలోకి త్వరలో అడుగిడనుంది. ఆ...
04-05-2021
May 04, 2021, 04:47 IST
కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు....
03-05-2021
May 03, 2021, 17:38 IST
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ...
03-05-2021
May 03, 2021, 16:25 IST
మనం హింసకు పాల్పడవద్దు
03-05-2021
May 03, 2021, 13:21 IST
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆదివారం సోషల్‌ మీడియా హోరెత్తిపోయింది. పార్టీలు, నేతల గెలుపోటములపై నెటిజన్లు ‘మీమ్స్‌’తో హల్‌చల్‌...
03-05-2021
May 03, 2021, 09:21 IST
పశ్చిమ బెంగాల్‌ను 1977 నుంచి 2011 దాకా.. 34 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలించిన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేడు దయనీయ స్థితికి...
03-05-2021
May 03, 2021, 09:01 IST
తమిళనాడులో కాంగ్రెస్‌ పతనమైన తర్వాత ద్రవిడ పార్టీలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి
03-05-2021
May 03, 2021, 08:07 IST
పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ – బీజేపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైంది.
03-05-2021
May 03, 2021, 07:26 IST
అసెంబ్లీలో కాలుమోపాలని ఎన్నాళ్లుగానో కలలుగంటున్న కమలనాథులు తమ కలను సాకారం చేసుకున్నారు.
03-05-2021
May 03, 2021, 06:30 IST
కోల్‌కతా: కాంగ్రెస్‌ కుంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్‌లు ఈసారి తృణమూల్‌కు జై కొట్టాయి. ఫలితంగా మమతా...
03-05-2021
May 03, 2021, 06:06 IST
న్యూఢిల్లీ: ప్రస్తుతం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా మమతా బెనర్జీ ఘన విజయం రెండు విషయాలను స్పష్టం...
03-05-2021
May 03, 2021, 05:32 IST
 న్యూఢిల్లీ: కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని 3 లోక్‌సభ స్థానాలు, 10 రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు...
03-05-2021
May 03, 2021, 05:21 IST
తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే...
03-05-2021
May 03, 2021, 05:15 IST
పశ్చిమ బెంగాల్‌ తన తీర్పుతో భారతదేశాన్ని రక్షించిందని తృణమూ ల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం  మమతా బెనర్జీ అన్నారు. ...
03-05-2021
May 03, 2021, 04:48 IST
అస్సాంలో కమలదళానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. క్లీన్‌ఇమేజ్‌తో బీజేపీ విజయానికి తోడ్పడిన ముఖ్యమంత్రి సర్బానంద...
03-05-2021
May 03, 2021, 04:41 IST
గువాహటి: ఎగ్జిట్‌పోల్స్‌అంచనాలను నిజంచేస్తూ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించింది. 126 స్థానాలున్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top