Jai Jagan Slogans in Madhanapalle TDP Office - Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయంలో జై జగన్ అంటూ నినాదాలు..

Jul 31 2023 4:08 PM | Updated on Jul 31 2023 4:41 PM

Jai Jagan Slogans In Madhanapalle TDP Office - Sakshi

చిత్తూరు జిల్లా: టీడీపీలో ఉన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. నాయకులు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే చంద్రబాబు వైఖరిపై విమర్శలు కురిపించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.  మదనపల్లె టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును బూతులు తిడుతూ టీడీపీ నేత విద్యాసాగర్ ఆగ్రహావేశం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేశారు.  

టీడీపీ నేత విద్యాసాగర్.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఈ సందర్భంగా వ్యగ్యాంస్త్రాలు సంధించారు. వయసైపోయాక బాబుకి వేపకాయంత వెర్రి వచ్చిందని మాట్లాడారు. బస్టాండ్‌లో టీడీపీ జెండా తగులబెడతానని అన్నారు. జగన్ మాకేమీ ద్రోహం చేయలేదు.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోకు సంబంధించిన ఘటన కొన్ని రోజుల క్రితం జరగగా.. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: పార్లమెంట్‌ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement