‘చంద్రబాబు అన్నమే తింటున్నారా?’ : ఎంపీ మాధవ్ | Inappropriate Comments On CM Jagan, MP Gorantla Asks CBN For Apology - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు: ‘చంద్రబాబు అన్నమే తింటున్నారా?’ ఎంపీ గోరంట్ల ఫైర్‌

Sep 7 2023 9:05 AM | Updated on Sep 7 2023 1:21 PM

inappropriate Comments On CM Jagan MP Gorantla Asks CBN Apology - Sakshi

జగన్‌.. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు మాట్లాడడంపై తీవ్రస్థాయిలో.. 

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, బాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదని.. సదరు వ్యాఖ్యలపై చంద్రబాబును కలిసి నిలదీస్తానని ఎంపీ మాధవ్‌ చెప్పారు. 

చంద్రబాబు వైఎస్‌ విజయమ్మను కించపరిచారు. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? లేదంటే ఇంకేమైనా తింటున్నారా?. చంద్రబాబును మహిళా లోకం క్షమించదు. ముక్కు నేలకు రాసి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుని తీరతామని అని హెచ్చరించారు గోరంట్ల. అలాగే.. అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు ను నిలదీస్తానని, అందుకోసం ఆయన శిబిరం వద్దకు వెళ్తానని ఎంపీ గోరంట్ల తెలిపారు.

బుధవారం అనంత రాయదుర్గం బహిరంగ సభలో ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన చంద్రబాబు.. ‘‘జ‌గ‌న్.. నీ పుట్టుకే త‌ప్పుడు పుట్టుక‌..’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement