Home Minister Taneti Vanitha Comments on Chandrababu - Sakshi
Sakshi News home page

‘టీడీపీ తప్పుడు ప్రచారం.. ఇదేం రాజకీయం బాబు’

May 5 2022 5:24 PM | Updated on May 5 2022 7:24 PM

Home Minister Taneti Vanitha Comments On Chandrababu - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని.. చంద్రబాబు పాలనతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని.. చంద్రబాబు పాలనతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళలకు భద్రత కోసం జీరో ఎఫ్ఐఆర్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చామన్నారు. కఠినమైన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయని, అందుకే వేగంగా శిక్షలు వేసేలా చట్టం తెచ్చామని హోంమంత్రి అన్నారు.
చదవండి: చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్‌ అదిరిపోయే సెటైర్లు..

‘‘మహిళలపై నేరాల నియంత్రణకి దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్‌ని కోటి 28 లక్షలు మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ వలన 900 మంది మహిళలను కాపాడాం. ఫోరెన్సిక్ ల్యాబ్‌ లు తెచ్చాం, మహిళ కోర్టులు తెచ్చాం. గతంలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు రూ.50 కోట్లు పరిహారం ఇచ్చారు. సీఎం జగన్ పాలనలో ఇప్పటికే 120 కోట్లు పరిహారం ఇచ్చామని’’ మంత్రి అన్నారు.

‘‘మహిళకు భద్రతకు చర్యలు తీసుకుంటుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలో టీడీపీ వెళ్లి రాజకీయం చేస్తుంది. మహిళల భద్రత కోసం ప్రతి గ్రామంలో మహిళ పోలీస్‌ని నియమించాం. దిశ చట్టంపై కేంద్రం అడిగిన క్లారిఫికేషన్‌ను 20 రోజుల కిందట పంపాం. ఇప్పటికి రెండు సార్లు క్లారిఫికేషన్ అడిగితే సమాధానం పంపినట్లు హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement