ఆ నిందితులను బహిరంగంగా ఉరితీయాలి: నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

Hang Sacrilege Accused In Public Says Congresss Navjot Sidhu - Sakshi

చంఢీఘడ్‌: పంజాబ్‌లోని స్వర్ణదేవాలయం, కపుర్త ఘటనలకు సంబంధించిన కుట్రదారులను బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ డిమాండ్‌ చేశారు.  ఆయన మాలేర్‌కోట్లలో జరిగిన సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత మంది కావాలనే మత విద్వేశాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలతో.. పంజాబ్‌లో అశాంతిని సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే స్వర్ణదేవాలయం ఘటనపై సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నిన్న సీఎం చన్నీ(డిసెంబరు 19)న స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక​ ప్రార్థనలు చేశారు.  భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వరుస ఘటనలతో ఆయా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భద్రతను పెంచాయి. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం కోరారు. కాగా,  స్వర్ణదేవాలయంలోని నిశిద్ధ ప్రాంతం, కపుర్త జిల్లా నిజాంపూర్‌ లోని గురుద్వారా పైకెక్కి పవిత్ర జెండా (నిషాన్‌ సాహిబ్‌)ను తొలగించడానికి ప్రయత్నించిన వ్యక్తులు స్థానికుల మూకదాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను ఇప్పటికే పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనపై ఇప్పటికే సిట్‌  దర్యాప్తును వేగవంతం చేసింది. 

చదవండి: 'పార్టీ కోసం నా జీవితం అర్పించా.. కాషాయం విడిచేది లేదు'

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top