ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశ భవనాలెక్కడ? : ఉత్తమ్‌

GHMC Elections 2020 : Uttam Kumar Reddy Fires On TRS Manifesto - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌కు చేసిందేమి లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. లక్ష ఇళ్లు అని ఒక్క ఇళ్లైనా ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు మాటలతో మభ్యపెడుతున్నారే తప్ప.. ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆరోపించారు. మంగళవారం ఆయన ఇందిరా భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోనే మళ్లీ రిలీజ్‌ చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని, మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో చెప్పిన పనులే చేయలేదు.. మళ్ళీ అవే మాటలు చెప్తున్నారని విమర్శించారు.
(చదవండి : ‘వాళ్లకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను అమ్మేస్తారు’)


‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. గత ఎన్నికల మేనిఫోస్టోనే మళ్లీ విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. దళిత ముఖ్యమంత్రి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి ఎక్కడా  ఇచ్చారు? 100 రోజుల ప్రణాళిక, ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశ భవనాలెక్కడ?  కరోన ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు? దోబిలకు, సెలూన్లకు ఇప్పటి వరకు ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వలెదు? డ్రైనేజ్ సిస్టం ఎందుకు బాగు చేయలేదు?’ అని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top