‘సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్ధరహితం’

Gadikota Srikanth Reddy Slams On Somu Veerraju In YSR Kadapa - Sakshi

వైఎస్సార్‌ కడప: సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్ధరహితమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ అన్నారు. ఆ హోదాలో ఉన్న ఆయన అలా మాట్లాడటం తగదన్నారు. గడికోట శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సోము వీర్రాజు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. అధికారులను వాడుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసని మండిపడ్డారు.

ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రజల కోసం ఏర్పాటైన పార్టీ అని, ప్రజల మద్దతు ఉంటేనే ఏకగ్రీవాలు అవుతాయని గుర్తుచేశారు. పోలీసులను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని తెలిపారు. సోము వీర్రాజు కేవలం ఉనికి కోసం మాట్లాడుతున్నారని అన్నారు.

చదవండి: చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు
చదవండి:  57 మందితో బీజేపీ తొలి జాబితా.. హాట్‌ టాపిక్‌గా నందిగ్రామ్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top