దీదీపై సువేందు పోటీ.. 57మందితో బీజేపీ తొలి జాబితా

West Bengal election 2021: BJP Declares List Of 57 Candidates - Sakshi

​కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. మమత కంచుకోట బద్దలు కొట్టి బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరవేయాలనే ప్లాన్‌తో దూసుకుపోతుంది. ఇందులో భాగంగా శనివారం తొలి జాబితాను ప్రకటించింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) ఒకేసారి 291 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ తాజా జాబితా విడుదల చేసింది. మమతా పోటీ చేస్తున్న నందిగ్రామ్‌ స్థానానికి టీఎంసీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరిన సువేందు అధికారిని పేరును ప్రకటించడంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సువేందు అధికారితో పాటు మాజీ క్రికెటర్‌ అశోక్‌ దిండా, మాజీ ఐపీఎస్‌ అధికారి భారతీ ఘోష్‌ తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొయినా నియోజకవర్గం నుంచి అశోక్‌ దిండా పోటీ చేయనున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27, 1, 6, 10, 17, 22, 26, 29 తేదీలలో ఎనిమిది దశల్లో జరుగనున్నాయి. మే 2 న ఓట్లు  లెక్కింపు ఉంటుంది.

చదవండి:
ఫిరాయింపుల జోరు : దీదీకి వరుస షాక్స్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top