Former MP Jithender Reddy Fires On TRS Leaders - Sakshi
Sakshi News home page

'బీజేపీని వదిలేది లేదు.. మా తమ్ముడిని సీఎం చేశాక ఏమైనా ఆలోచిస్తా'

Oct 22 2022 3:09 AM | Updated on Oct 22 2022 10:12 PM

Former MP Jithender Reddy Fires on TRS Leaders - Sakshi

సాక్షి, సంస్థాన్‌ నారాయణపురం: బీజేపీ సిద్ధాంత పార్టీ.. ప్రజల కోసం, దేశం కోసం పోరాడు తున్న పార్టీ.. ఇటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ శుక్రవారం రాత్రి రాజగోపాల్‌రెడ్డితో కలిసి సంస్థాన్‌ నారాయణపురంలో రోడ్‌ షో నిర్వ హించారు. రోడ్‌షోలో పాల్గొన్న జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాటల్లోనే... ’’‘నేను ప్రగతిభవన్‌లో ఉన్నానట.. ‘నన్ను నీవా కొనేది.. నాకా మెసేజ్‌లు పంపించేది. (జుట్టును చూపిస్తూ) నా వెంట్రుక కూడా కొనలేవు. బీజేపీ ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు, లుచ్చా మనుషులే బయటకు పోతారు. జితేందర్‌రెడ్డి లాంటి వారు పోరు’....

‘గుర్తుపెట్టుకో హుజూరాబాద్‌లో ఎన్నికలో పెద్దిరెడ్డిని తీసుకొని పోయావు. మోత్కుపల్లి నర్సింహులును, కాంగ్రెస్‌ నుంచి ఓ లీడర్‌ను తీసుకుపోయావు. ఏమైనా పీకగలిగినవా, ఏమైనా చేశావా.. ప్రజలు 25వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఎవడిని తీసుకొని పోయినా రాజగోపాల్‌రెడ్డి 50వేల మెజారిటీతో గెలుస్తాడు. బీజేపీని వదిలేది లేదు. మా తమ్ముడు సంజయ్‌ను సీఎంను చేస్తా అప్పుడు ఏమైనా ఆలోచిస్తా’ అని వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement