సీఎంకు ఎన్నికల రోగం | Sakshi
Sakshi News home page

సీఎంకు ఎన్నికల రోగం

Published Tue, Nov 29 2022 2:36 AM

Former Minister Ponnala Lakshmaiah Criticized Telangana CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు ఎన్నికల రోగం పట్టుకుందని, అందుకే డ్రామాలు, తమాషాలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఒక్క రోజు కూడా యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటుపై సమీక్షలు చేయని వ్యక్తి... ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో పనిచేస్తు న్నట్టుగా రుజువు చేసుకునేందుకే ప్లాంటు సంద ర్శన చేపట్టారని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేసీఆర్‌ ద్రోహ పూరితంగా తెలంగాణను అప్పులు పాలుజేస్తున్నారని ఆరోపించారు.

కేవలం రూ.4కే బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ లభిస్తుంటే యాదాద్రి ప్లాంటు పేరుతో యూనిట్‌కు రూ.10 ఖర్చు పెట్టి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం దుర్మార్గమన్నారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి రూ.29 వేల కోట్ల అంచనా వ్యయం అయితే, ఇప్పటికే రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారని, అయినా యాదాద్రి పనులు పూర్తి కాలేదని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. నీరు, బొగ్గు ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్‌ హయాంలో మొదలుపెట్టిన పవర్‌ ప్లాంట్‌ పనులు పక్కన పెట్టారని విమర్శించారు.  

Advertisement
 
Advertisement