బీజేపీకి భారీ షాక్..కాంగ్రెస్‌లోకి మాజీ కేంద్ర మంత్రి | Ex-union Minister Birender Singh Quits Bjp, To Join Congress | Sakshi
Sakshi News home page

బీజేపీకి భారీ షాక్..కాంగ్రెస్‌లోకి మాజీ కేంద్ర మంత్రి

Apr 8 2024 5:00 PM | Updated on Apr 8 2024 5:40 PM

Ex-union Minister Birender Singh Quits Bjp, To Join Congress - Sakshi

లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.  

తన కుమారుడు బ్రిజేందర్ సింగ్ కాంగ్రెస్‌ పార్టీ చేరిన దాదాపు నెల రోజుల తర్వాత బీరేందర్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన  భార్య, హర్యానా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ లత కూడా బీజేపీని వీడారు.

ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బీరేందర్ సింగ్ మాట్లాడుతూ..‘నేను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. నా రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపాను. 2014-2019 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన నా భార్య ప్రేమ్ లత కూడా రాజీనామా చేశారు. రేపు, మేం కాంగ్రెస్‌లో చేరనున్నాం’ అని అన్నారు.

కాగా, బీరేందర్‌ సింగ్‌ కుమారుడు బ్రిజేందర్‌ సింగ్‌ మార్చి 10న కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా, తండ్రి సైతం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం ఖరారైంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement